BIRTHDAY CELEBRATIONS: తన గారాల పట్టి లేనప్పటికీ ఆమె జ్ఞాపకాలతో జీవిస్తున్న ఓ తండ్రి ఆమె ఫొటో పెట్టి ఆమె ఉన్నప్పటి మాదిరిగానే పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన ఘటన విశాఖ జిల్లా భీమిలి మండలం కృష్ణంరాజు పేట గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే తుపాకుల అప్పలనాయుడు కుమార్తె ప్రవళ్లికారెడ్డి (8) ఈ ఏడాది మార్చి10న బ్లడ్ క్యాన్సర్తో మృతి చెందింది. చనిపోయిన కూతురు పుట్టినరోజు సందర్భంగా ఆమె చదివిన ట్యూషన్ సెంటర్లో బాలల మధ్య ఆదివారం రాత్రి కుమార్తె త్రీడీ ఫొటో పెట్టి ఆమె అందరి మధ్య ఉన్న భావనను కల్పిస్తూ ఘనంగా వేడుకలు జరిపారు. పితృదినోత్సవం కూడా కావడంతో ఇది చూసినవారంతా ఆ తండ్రి ప్రేమకు ఔరా అంటూ చిన్నారి వారి మధ్య లేకపోవడంతో కంటతడి పెట్టుకున్నారు.
ఇవీ చదవండి: