విశాఖ జిల్లా చోడవరంలో ఆక్రమణ తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. డిప్యూటీ తహసీల్దార్ సమక్షంలో రెవెన్యూ సిబ్బంది గునపాలతో రేకుల షెడ్డును కూల్చేపనులు చేపట్టారు. ఈ సంఘటనను తట్టుకోలేని రేకుల షెడ్డు యజమాని సానబోయిన పరదేశి.. పురుగుల మందు తాగగా, అతని కుమారుడు రాయితో తల పగులకొట్టుకున్నాడు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సర్వే నెం .23లో రస్తా పోరంబోకు స్థలంలో.. పరదేశి రేకుల షెడ్డు వేసుకుని నివాసం ఉంటున్నాడు. స్థలం అక్రమించి రేకుల షెడ్డు వేసుకున్నాడని..దానిని తొలగించాలని స్పందనలో ఫిర్యాదు వచ్చింది. షెడ్డును తొలగించాలని అధికారులు యజమానికి చెప్పినా తొలగించకపోవడంతో.. రెవెన్యూ సిబ్బంది గునపాలతో షెడ్డును పగులుగొట్టే ప్రయత్నం చేశారు. దానిని చూసి తండ్రి కొడుకులు తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించగా..వారిని ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి.