విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం ఎం.అలమండలోని వ్యవసాయ సహకార సంఘం ఎదుట యూరియా కోసం రైతులు ఎగబడుతున్నారు. ఉదయం నుంచే కార్యాలయం ఎదుట బారులు తీరారు. ఒకరికి కేవలం ఒక్క బస్తా యూరియా మాత్రమే ఇస్తుండటంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యూరియా నిల్వలు సైతం తక్కువగా ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో... రైతులు పెద్దగా పోటెత్తడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. అధికారులు స్పందించి అవసరమైన మేరకు ఎరువులు పూర్తి స్థాయిలో అందించాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: సీఐడీ కేసుపై హైకోర్టును ఆశ్రయించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ