ETV Bharat / state

ఎదురుతిరిగిన రైతులు... వెనుదిరిగిన అధికారులు - విశాఖ జిల్లాలో భూ సేకరణ

పచ్చని పంటలు పండే సాగుభూమిని చదును చేసి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఆ భూమినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతులు... వారికి అడ్డుపడ్డారు. దౌర్జన్యంగా భూములు లాక్కుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. అధికారులు వెనుదిరిగారు.

land acquisition in vishaka district
land acquisition in vishaka district
author img

By

Published : Feb 15, 2020, 10:34 PM IST

ఎదురుతిరిగిన రైతులు... వెనుదిరిగిన అధికారులు

ప్రభుత్వం చేపడుతోన్న భూసేకరణకు రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విశాఖ జిల్లా చీడికాడ మండలం జి.కొత్తపల్లిలో భూసేకరణకు వచ్చిన అధికారులకు రైతులు అడ్డుపడ్డారు. తమ భూమిని లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 167 సర్వే నంబర్​లో 37.5 ఎకరాల భూమికి సంబంధించి రైతులకు ఎన్నో ఏళ్ల కిందట ప్రభుత్వం డి-ఫారం పట్టాలు ఇచ్చింది. ఆ భూమిలో 29 మంది రైతులు జీడిమామిడి తోటలు, యూకలిప్టస్ సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఇళ్ల స్థలాల కోసం రైతుల భూములను స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు చదును యంత్రాలతో సహా అక్కడికి వెళ్లారు. వారిని రైతులు అడ్డుకున్నారు. అన్నదాతల ఆగ్రహావేశాలను చూసిన అధికారులు వెనుదిరిగారు. రైతులందరికీ ప్రభుత్వం ఇచ్చిన డి-ఫారం పట్టాలు ఉన్నాయని... భూములు తీసుకుంటే పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన డి-ఫారం పట్టాలను రద్దు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి

నో టైం: ఆఫీస్‌లో పెళ్లిచేసుకున్న అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.