విశాఖలో సీపీఎం నాయకులు ఆర్ఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో పద్మనాభం తహసీల్దార్ కార్యాలయంలో ఫారం-2ను అందజేశారు. పద్మనాభం మండలం అనంతవరం, విజయరాంపురం, తునివలస, నరసాపురం, గంధవరం, మద్ది, రెడ్డిపల్లి రెవెన్యూ గ్రామాలలో 515 ఎకరాల ఆక్రమణ, డి-పట్టా భూములకు ప్రభుత్వం భూసమీకరణ చేపట్టింది. ప్రతి రెవెన్యూ గ్రామంలో రైతులు భూ సమీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ గోడును అధికారులకు వెలిబుచ్చుతున్నారు. సుమారు 450 మంది రైతులకు 207 మంది రైతులు భూ సమీకరణకు వ్యతిరేకంగా ఫారం-2 దరఖాస్తులను అందజేశారు. ప్రారంభంలో రైతుల నుంచి ఫారం-2 దరఖాస్తులను తహసీల్దార్ తీసుకోలేదు. రైతులు కార్యాలయం ముందు కార్యాలయంలో నినాదాలు చేశారు. స్పందించిన తహసీల్దార్ దరఖాస్తులు తీసుకున్నారు. ఏళ్ల తరబడి కొండలు గుట్టలు బీడు భూములను సైతం చదును చేసి, సాగుచేస్తూ వ్యవసాయ భూములుగా మార్చుకొని జీవనాధారం కల్పించుకున్నామని, ఉన్నపళంగా భూములను ప్రభుత్వానికి అప్పగించమంటే ఎలా బతికేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
భూసమీకరణకు వ్యతిరేకంగా ఫారం-2 దరఖాస్తులు ఇచ్చిన రైతులు - farm 2 application gave to MRO officers in visakha dst
భూసమీకరణకు విశాఖ జిల్లా వ్యాప్తంగా రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పద్మనాభం తహసీల్దార్ కార్యాలయంలో భూసేకరణకు వ్యతిరేకంగా 207 మంది రైతులు ఫారం-2 తహసీల్దార్ త్రినాథ్ రావు నాయుడుకు అందజేశారు.

విశాఖలో సీపీఎం నాయకులు ఆర్ఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో పద్మనాభం తహసీల్దార్ కార్యాలయంలో ఫారం-2ను అందజేశారు. పద్మనాభం మండలం అనంతవరం, విజయరాంపురం, తునివలస, నరసాపురం, గంధవరం, మద్ది, రెడ్డిపల్లి రెవెన్యూ గ్రామాలలో 515 ఎకరాల ఆక్రమణ, డి-పట్టా భూములకు ప్రభుత్వం భూసమీకరణ చేపట్టింది. ప్రతి రెవెన్యూ గ్రామంలో రైతులు భూ సమీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ గోడును అధికారులకు వెలిబుచ్చుతున్నారు. సుమారు 450 మంది రైతులకు 207 మంది రైతులు భూ సమీకరణకు వ్యతిరేకంగా ఫారం-2 దరఖాస్తులను అందజేశారు. ప్రారంభంలో రైతుల నుంచి ఫారం-2 దరఖాస్తులను తహసీల్దార్ తీసుకోలేదు. రైతులు కార్యాలయం ముందు కార్యాలయంలో నినాదాలు చేశారు. స్పందించిన తహసీల్దార్ దరఖాస్తులు తీసుకున్నారు. ఏళ్ల తరబడి కొండలు గుట్టలు బీడు భూములను సైతం చదును చేసి, సాగుచేస్తూ వ్యవసాయ భూములుగా మార్చుకొని జీవనాధారం కల్పించుకున్నామని, ఉన్నపళంగా భూములను ప్రభుత్వానికి అప్పగించమంటే ఎలా బతికేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి మా భూములిచ్చే ప్రసక్తే లేదు : రైతులు