విశాఖలోని డాక్టర్ వి.ఎస్. కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎ, బీకాం, బీఎస్సీ ప్రవేశాలకు సంబంధించి మొదటి సంవత్సరం కోసం దరఖాస్తు తేదీని పొడిగించారు. ఈనెల 21వ తేదీ వరకు గడువు పెంచుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి. చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 24న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.
ఇదీ చదవండి: పట్టాలకెక్కని విశాఖ రైల్వే జోన్!