విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం పాడి గ్రామ కొండల్లో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 2400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు.
ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో పోలీసులకు వాలంటీర్లు, మహిళా పోలీసులు సాయం చేశారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, సీఐ కూర్మారావు, ఎస్సై రాజ్యలక్ష్మి దాడుల్లో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: