అరాచకాలు జరిగినప్పుడు, పోలీసులే అఘాయిత్యాలకు పాల్పడినప్పుడు పోలీసు అధికారుల సంఘం ఎందుకు ఖండించలేదని మాజీ మంత్రి అయన్నపాత్రుడు నిలదీశారు. తప్పు చేయకపోతే గుంటూరు జిల్లాలో కానిస్టేబుల్ ని ఎందుకు సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు ఇవ్వకపోతే,కానిస్టేబుల్ అత్యాచారం చేయవచ్చా..? అని మండిపడ్డారు. సంఘం ప్రకటించినట్లు పోలీసులు మహిళల రక్షణ కోసం పనిచేస్తుంటే.. రాష్ట్రంలో 500 మంది మహిళలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఎలా జరిగాయని..? అయ్యన్న నిలదీశారు. సాక్షిలో కూడా అత్యాచారం వార్త వచ్చిందని.. వివక్ష చూపకుండా విధులు నిర్వర్తించే వారికి సెల్యూట్ చేస్తామని ట్వీట్ చేశారు.
కానిస్టేబుల్ సస్పెండ్.. ఏం జరిగిందంటే..
గుంటూరు జిల్లాలో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. కొత్తపేట పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రమేశ్.. ఏటీ అగ్రహారంలో పదో తరగతి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు దిశా స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ఎస్పీ ఆరీఫ్ హఫీజ్.. రమేశ్‌ను సస్పెండ్ చేశారు.
-
ఏపీలో అరాచకాలు జరిగినప్పుడు, పోలీసులే అఘాయిత్యాలకు పాల్పడినప్పుడు కనీసం ఖండన కూడా ఇవ్వని పోలీస్ అధికారుల సంఘం...మీడియాలో రిపోర్ట్ అయిన వార్తలపై నారా లోకేష్ స్పందిస్తే...ఖండఖండాలుగా ఖండించడం ఏ తప్పు కప్పిపుచ్చుకోవడానికి? ఎవరి మెప్పు పొందడానికి? తప్పు చేయకపోతే కానిస్టేబుల్ ని
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) August 22, 2021 " '="" class="align-text-top noRightClick twitterSection" data="
1/3 pic.twitter.com/fVMARLtZkG
">ఏపీలో అరాచకాలు జరిగినప్పుడు, పోలీసులే అఘాయిత్యాలకు పాల్పడినప్పుడు కనీసం ఖండన కూడా ఇవ్వని పోలీస్ అధికారుల సంఘం...మీడియాలో రిపోర్ట్ అయిన వార్తలపై నారా లోకేష్ స్పందిస్తే...ఖండఖండాలుగా ఖండించడం ఏ తప్పు కప్పిపుచ్చుకోవడానికి? ఎవరి మెప్పు పొందడానికి? తప్పు చేయకపోతే కానిస్టేబుల్ ని
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) August 22, 2021
1/3 pic.twitter.com/fVMARLtZkGఏపీలో అరాచకాలు జరిగినప్పుడు, పోలీసులే అఘాయిత్యాలకు పాల్పడినప్పుడు కనీసం ఖండన కూడా ఇవ్వని పోలీస్ అధికారుల సంఘం...మీడియాలో రిపోర్ట్ అయిన వార్తలపై నారా లోకేష్ స్పందిస్తే...ఖండఖండాలుగా ఖండించడం ఏ తప్పు కప్పిపుచ్చుకోవడానికి? ఎవరి మెప్పు పొందడానికి? తప్పు చేయకపోతే కానిస్టేబుల్ ని
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) August 22, 2021
1/3 pic.twitter.com/fVMARLtZkG
ఇదీ చదవండి
Constable suspended: బాలిక పట్ల కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన..సస్పెన్షన్