ఇవీ చూడండి..: CM Jagan: 'పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే మా లక్ష్యం'
'ఈ ఏడాది క్విట్ నినాదంతో.. యాంటీ టుబాకో డే'
పొగాకు నమిలే వారికి కరోనా సోకితే ప్రాణాలు పోయే ప్రమాదముందని.. విశాఖలోని మహాత్మాగాంధీ కేన్సర్ ఆస్పత్రి ఎండీ మురళీ కృష్ణ చెబుతున్నారు. ఇలాంటి విపత్కర సమయంలోనైనా ధూమపానం, పొగాకు నమిలి ఉమ్మేసే అలవాటు మానేయాలని.. సూచిస్తున్నారు. ఏటా మే 31న అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినంగా పాటిస్తూ.. పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే అనర్థాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నాయన్నారు. ఈ ఏడాది మాత్రం క్విట్ అన్న నినాదంతో యాంటీ టుబాకో డే జరపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చిందని చెప్పారు. అంచనాల ప్రకారం ప్రకటనల ద్వారా చాలా మంది పొగాకు మానేస్తున్నప్పటికీ.. ఆడవాళ్లే ఎక్కువ అలవాటు పడుతున్నారంటున్న డాక్టర్ మురళీ కృష్ణతో ఈటీవీ ముఖాముఖి..
డాక్టర్ మురళీ కృష్ణతో ఈటీవీ ముఖాముఖి