ఇదీ చదవండి: మనసు దోచేస్తున్న గృహ అలంకరణ స్టాల్
విజయవంతంగా ఈనాడు మెగా ప్రాపర్టీ ఎక్స్పో - eenadu property expo closing news
విశాఖలో రెండు రోజులుగా నిర్వహించిన ఈనాడు మెగా ప్రాపర్టీ ఎక్స్ పో-2019 విజయవంతంగా ముగిసింది.
విజయవంతంగా ముగిసిన ఈనాడు మెగా ప్రాపర్టీ ఎక్స్పో
విశాఖలో ఏర్పాటు చేసిన ఈనాడు మెగా ప్రాపర్టీ ఎక్స్పో 2019 ఘనంగా ముగిసింది. బీచ్ రోడ్డులోని గాదిరాజు ప్యాలెస్లో నిర్వహిచిన ఎక్స్పోకు విశేషమైన ప్రజాదరణ లభించింది. అనేక స్థిరాస్తి, నిర్మాణ రంగ సంస్థలను ఒకే వేదికపై ఉండటం తమకు ఎంతో ఉపయోగపడిందని ప్రాపర్టీ ఎక్స్పోకు వచ్చిన సందర్శకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రాపర్టీ ఎక్స్ పో ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ పాల్గొన్నారు. ఈనాడు మెగా ప్రాపర్టీ ఎక్స్ పో సందర్శించిన వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లక్కీ డ్రా విజేతలకు సీఎంఆర్ అధినేత బహుమతులను అందించారు. ఈ తరహా ప్రాపర్టీ షోను నిర్వహించి ప్రజలకు ఉపయోగపడడంలో ఈనాడు కృషిని ఆయన అభినందించారు. మెగా ప్రాపర్టీ ఎక్స్ పో విశాఖ నగర స్థిరాస్తి వ్యాపారంలో సరికొత్త ఉత్సాహాన్ని తెచ్చిందని స్థిరాస్తి సంస్థల యజమానులు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: మనసు దోచేస్తున్న గృహ అలంకరణ స్టాల్
sample description