పాఠశాలలు అభివృద్ధికి చేపడుతున్న నాడు- నేడు పనులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని సమగ్ర శిక్షణ ఈఈ డి.నరసింహరావు సూచించారు. విశాఖ జిల్లా చీడికాడలోని మండల పరిషత్ కార్యాలయంలో వివిధ పాఠశాల హెచ్.ఎంలతో నాడు- నేడు పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. సమీక్షలో మండల విద్యా శాఖాధికారి గంగరాజు, ఇంజనీర్ చైతన్యతోపాటుగా పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...