ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో జరుగుతున్న సీ పవర్ కాన్ఫరెన్స్- 2019లో భారత్ నుంచి తూర్పు నౌకాదళాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ హాజరయ్యారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ సదస్సును రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ నిర్వహిస్తోంది. అంతర్జాతీయ నేవీ సహకారంలో భాగంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. భారత ప్రధాని మోదీ నిర్దేశించినట్టుగా 'సాగర్ - సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ అల్' అనే విధానానికి భారత్ కట్టుబడి ఉందని వైస్ ఆడ్మిరల్ చెప్పారు. సముద్ర జలాలపై పొంచి ఉన్న మారిటైం ఉగ్రవాదం అరికట్టేందుకు భారత్ అన్ని దేశాలతో కలసి పని చేస్తోందని తెలిపారు. 'ఇండో ఫసిఫిక్ మారిటైం పరిస్థితి - 21వ శతాబ్దపు సవాళ్లు' అనే అంశంపై జరుగుతున్న ఈ సదస్సుకు 80 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సుకు హాజరైన పలుదేశాల నేవీ, ఎయిర్ఫోర్స్, ఉన్నతస్థాయి అడ్మిరల్, కమాండర్లతో జైన్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సింగపూర్, అమెరికా, ఆస్ట్రేలియా పలు ఆసియా, యూరోప్, అమెరికా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఇదీ చదవండి :