ETV Bharat / state

లోడింగ్​లో తొలి రైల్వే జోన్​గా నిలిచిన తూర్పుకోస్తా రైల్వే

author img

By

Published : Jan 13, 2021, 1:47 AM IST

ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో తూర్పు కోస్తారైల్వే 150 మిలియ‌న్ ట‌న్నుల లోడింగ్ చేసిన తొలి రైల్వే జోన్​గా నిలిచింది. ఈ మేరకు రైల్వే శాఖ వివరాలు వెల్ల‌డించింది.

east coast railway
లోడింగ్​లో తొలి రైల్వే జోన్​గా నిలిచిన తూర్పుకోస్తా రైల్వే

ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో తూర్పు కోస్తా రైల్వే 150 మిలియ‌న్ ట‌న్నుల లోడింగ్ చేసిన తొలి రైల్వే జోన్​గా నిలిచింది. మూడో త్రైమాసికం పూర్త‌య్యేనాటికి తూర్పు కోస్తా రైల్వే 144.25 మిలియ‌న్ ట‌న్నుల స‌ర‌కు లోడింగ్ చేయగా.. జ‌న‌వ‌రి 10 వరకు మ‌రో 84.10 మెట్రిల‌క్ ట‌న్నుల స‌ర‌కు లోడింగ్ చేసి దేశంలోనే ఈ ఘ‌న‌త సాధించిన జోన్​గా నిలిచింది.

ప్ర‌స్తుత అర్థిక సంవ‌త్స‌రంలో 84.10 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గు, 20.50 మిలియ‌న్ ట‌న్నుల ఇనుప‌ఖ‌నిజం, 13.03 మిలియ‌న్ ట‌న్నుల ఇనుము, ఉక్కు, 5.67 మిలియ‌న్ ట‌న్నుల స్టీల్​ప్లాంట్​కు అవ‌స‌ర‌మ‌య్యే ముడి వ‌స్తువులు, 5.30 మిలియ‌న్ మెట్రిక్ ట‌న్నుల ఎరువులు, 2.29 మిలియన్ ట‌న్నుల కంటైన‌ర్లు, 2.05 మిలియ‌న్ మెట్రిక్ ట‌న్నుల ఆహార ఉత్ప‌త్తులు, 2.03 మిలియ‌న్ మెట్రిక్ ట‌న్నుల పెట్రోలియం ఉత్ప‌త్తుల‌ను ర‌వాణా చేసిన‌ట్టు రైల్వే శాఖ వెల్ల‌డించింది. జ‌న‌వ‌రి నెల తొలి రోజునుంచే జోరుగా అమ్మ‌కాలు పెగ‌రుతూ వ‌స్తున్నాయి. 15.6 వృద్ధి గ‌తేడాది ఇదే కాలంలో పోలిస్తే ఈ వృద్ధి అంచ‌నా వేశారు.

ఇదీ చదవండి:

రహదారి విస్తరణ పనులు జరిగేనా.?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.