అస్వస్థతకు గురైన వారిని పరామర్శించడానికి వెళ్లిన ఎంపీడీవోపై గిరిజనులు దాడి చేసిన ఘటన విశాఖ మన్యంలో జరిగింది. విశాఖ జిల్లా హుకుంపేట మండలం డొంకినవలసలో 2 రోజుల కిందట చనిపోయిన మేక మాంసం తిని ఒకరు మృతి చెందగా 27 మంది అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలసుకున్న వైద్య సిబ్బంది హుటాహుటిన గ్రామానికి చేరుకుని వైద్య సేవలు చేపట్టారు. రోగులను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీడీవో ఇమ్మాన్యుయేల్పై గిరిజనులు దాడికి తెగబడ్డారు. నీరు కలుషితమై డయోరియా సోకిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌకర్యాలు అన్ని మంచిగా ఉన్నాయని... చనిపోయిన మేక మాంసం తినటం వల్లే గిరిజనులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెబుతున్నారు.
కలుషితాహారంతో ఒకరు మృతి...పరామర్శకు వెళ్లిన అధికారిపై దాడి - ఎంపీడీవోపై దాడి
చనిపోయిన మేకను తినడం వల్ల విశాఖ మన్యంలో ఒకరు మృతి చెందగా.... మరో 27 మంది అస్వస్థతకు గురయ్యారు. అయితే నీరు కలుషితం అవటం వల్లే ఇలా జరిగిందనుకున్న గిరిజినులు.... పరామర్శకు వచ్చిన ఎంపీడీవోపై దాడికి పాల్పడ్డారు.