కరోనా ప్రబలుతున్న తరుణంలో ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు సూచించారు. అనకాపల్లిలో కర్ఫ్యూ అమలు తీరును ఆయన పరిశీలించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సిబ్బందికి సలహాలు సూచనలు చేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ఆంక్షలకు ప్రజల నుంచి సహకారం బాగానే ఉందని పేర్కొన్నారు. మహమ్మారిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ బాధ్యతగా వ్యవహరించాలని.. కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
ఇవీ చూడండి: