ETV Bharat / state

GVMC: జీవీఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ఆస్తి పన్ను పెంపుపై ఆందోళన - జీవిఎంసీ వార్తలు

జీవీఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ జీవీఎంసీ కార్యాలయాన్ని తెదేపా,జనసేన, సీపీఎం కార్పొరేటర్లు ముట్టడించారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.

dharna at GVMC
ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ జీవీఎంసీ ముట్టడి....
author img

By

Published : Aug 7, 2021, 1:39 PM IST

జీవీఎంసీని ముట్టడించిన విపక్షాలు

ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ తెదేపా, జనసేన, సీపీఎం కార్పొరేటర్లు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తెదేపా, జనసేన, సీపీఎం కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. నిరసనకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ధర్నాకు దిగిన కార్పొరేటర్లను అరెస్టు చేయగా.. అక్కడి వాతావరణం మరింత గందరగోళంగా మారింది. ఈ ఘటనతో జీవీఎంసీ కౌన్సిల్‌ హాల్‌లో పాలకవర్గం వెంటనే సమావేశమైంది. ఆస్తి పన్ను పెంపుపై ప్రత్యేక చర్చను చేపట్టింది.

ఇదీ చదవండి:

NIRMALA: ఆంధ్రా ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘాన్ని సందర్శించిన కేంద్ర ఆర్థిక మంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.