విశాఖ జిల్లా పాయకరావుపేటలో ప్రసిద్ధి చెందిన చిలకల తీర్థానికి భక్తులు పోటెత్తారు. ప్రతి ఏటా ఉగాది రోజు ఈ తీర్థం నిర్వహిస్తారు. అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి, తుని, కోటనందూరు, తొండంగి, అన్నవరం, నక్కపల్లి, రాయవరం, తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేశారు. తీర్థంలో పంచదార చిలకలు, చాటలు కొనుగోలు చేస్తే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. రామాలయంలో పూజలు చేసి అనంతరం ఉగాది పంచాంగం చెప్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఇదీ చూడండి: ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడాలి: ఉగాది వేడుకల్లో సీఎం జగన్
గత ఏడాది కొవిడ్ కారణంగా ఈ వేడుక నిర్వహించలేదు. కొవిడ్ నిబంధనల మేరకు ఈ ఏడాది తీర్థం నిర్వహించారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దలు, పిల్లలు అని తేడా లేకుండా సందడి చేశారు.
ఇదీ చదవండి: