వైకాపా ముఖ్యనేత విజయసాయిరెడ్డి విశాఖలో భూకబ్జాలకు పాల్పడుతున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ చేసిన ఆరోపణలపై జీవీఎంసీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల అభివృద్ధికి విజయసాయిరెడ్డి ఎనలేని కృషి చేస్తుంటే… మూర్తి యాదవ్ ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. గతంలో సీఎం జగన్, విజయసాయిరెడ్డిని.. మూర్తియాదవ్ పొగిడిన రోజులు మర్చిపోయి… ఇలా మాట్లాడటం బాధాకరమన్నారు.
ఇదీ చదవండి:
ఆక్సిజన్ రైళ్లు నడపండి: రైల్వే బోర్డు ఛైర్మన్‌కు విజయసాయి లేఖ