వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం,తీవ్ర వాయుగుండంగా మారే సూచనలున్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఒడిశాలోని బాలాసోర్ కు సమీపంలో కేంద్రీకృతమైన వాయుగుండం.. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతోందని తెలిపింది. రాగల 6 గంటల్లో క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్టు స్పష్టం చేసింది. సాయంత్రానికి పశ్చిమ బంగాల్, ఒడిశా సరిహద్దుల్లోని బాలాసోర్, సాగర్ దీవుల సమీపంలో తీరాన్ని దాటే సూచనలు ఉన్నట్టు తెలిపింది. దీని ప్రభావంతో ఒడిశా, ఉత్తర కోస్తా, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నట్టు స్పష్టం చేసింది.
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం,ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం,తీవ్ర వాయుగుండంగా మారే సూచనలున్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో ఒడిశా, ఉత్తర కోస్తా, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది.