విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ మంగమారిపేట వద్ద గోకార్టింగ్ అక్రమ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చేశారు. సీఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటం వల్ల చర్యలు తీసుకున్నామని చెప్పారు. 2014లో పంచాయతీ అనుమతితో నిర్మించారని.. వుడా అనుమతి లేదని అధికారులు తెలిపారు. డిప్యూటీ సిటీఫ్లానర్ రాంబాబు ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేశారు. నాలుగు ఎకరాల 48 సెంట్ల భూమిలోని అక్రమ నిర్మాణాలను తొలగించారు.
ఇదీ చదవండి: భూములపై.. ఉపగ్రహ నిఘా