విశాఖ జిల్లాలోని చోడవరంలో కొవిడ్ తుది పరీక్షల నిర్థరణలో తీవ్రంగా ఆలస్యం జరుగుతోంది. గత శుక్రవారం నుంచి సోమవారం సాయంత్రం వరకు పాజిటివ్ లక్షణాలు నిర్థరించలేదు. పరీక్షలు చేయించుకున్న వారంతా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. దాదాపు 40 మంది వరకు పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలంటున్నాయి. పాజిటివ్ ను నిర్థారించేందుకు జరిపే ఆర్టిఫిషియల్ టెస్ట్ కిట్లు లేక పాజిటివ్ తుది నివేదికలను ప్రకటించలేదని చెబుతున్నారు. ఇప్పటి వరకు చోడవరం పట్టణంలో 31 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి. ఇందులో చోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు వారు 21 మంది. వీరిలో నలుగురు కోలుకుని కొవిడ్ కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లిపోయారు. మిగిలిన పదిమంది ప్రైవేట్ ఆసుపత్రులలో ఉన్నారు.
పట్టణంలో తొమ్మిది వరకు కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. వీటిలో ఆసుపత్రి వర్గాలు, ఆశ వర్కర్లు, వాలంటీరులు శిబిరాలు ఏర్పాటు చేసి మందులు అందజేస్తున్నారు.
ఇవీ చదవండి: ఆగస్టులో రైవాడ జలాశయం నుంచి ఆయకట్టుకు సాగు నీరు