విశాఖలో ఈనాడు - కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విద్యార్ధులకు అవగాహనా కార్యక్రమం జరిగింది. కాపులుప్పాడలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాల, శివం క్యాంపస్, మారిక వలస శ్రీచైతన్య జూనియర్ కళాశాల అబ్దుల్ కలాం క్యాంపస్లో.. దశ - దిశ కార్యక్రమం నిర్వహించారు. ఏటా వేలమంది ఇంజినీరింగ్ పట్టాలతో బయటకు వస్తున్నా... ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు సాధిస్తున్నది కొందరేనని వర్సిటీ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు.
ఇంజినీరింగ్లో చేరిన తొలి ఏడాది నుంచే.. ఆ వృత్తి పట్ల ఒక దీక్షగా పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు యత్నిస్తేనే, అగ్రస్థానంలో నిలబడేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈనాడు విశాఖ యూనిట్ మేనేజర్ శ్రీనివాస్ సదస్సు ఉద్దేశాన్ని వివరించారు. శ్రీచైతన్య జోనల్ ప్రిన్స్పల్స్ రాంబాబు, పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విద్యార్థులను తాము ఏరకంగా పోటీకి సిద్దం చేస్తోందీ వివరించారు. ఈనెల 24 నుంచి 26 వరకు ప్రతిభాపరీక్ష నిర్వహిస్తున్నామనీ.. ఇందులో మార్కులు, గ్రేడింగ్ ఆధారంగా ఫీజుల్లో రాయితీలు ఉంటాయన్నారు. కనీస ఫీజులు చెల్లించలేమనుకుంటే బ్యాంకు రుణాలు కూడా కల్పిస్తున్నట్టు కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రతినిధులు వివరించారు.
ఇదీ చదవండి: