ETV Bharat / state

తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ ప్రతిపాదనపై.. దళిత ఐక్య వేదిన నిరసన - విశాఖ జిల్లా వార్తలు

తోట త్రిమూర్తులుకు సీఎం జగన్.. శాసనమండలి సభ్యత్వం ఇచ్చేందుకు ప్రతిపాదించడాన్ని దళిత సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా వ్యతిరేకించింది. విశాఖలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

dalits protest vishakha
dalits protest vishakha
author img

By

Published : Jun 17, 2021, 4:16 PM IST

దళితులకు శిరోముండనం చేసి అవమానపరిచిన తోట త్రిమూర్తులుకు శాసనమండలి సభ్యత్వాన్ని ప్రతిపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పాతికేళ్ల గాయంపై కారం చల్లినట్లు ఉందని దళిత సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు అన్నారు. ఈ విషయంలో భారత రాష్ట్రపతి జోక్యం చేసుకుని దళితులకు న్యాయం చేయాలని కోరారు. తోట త్రిమూర్తులుకు శాసనమండలి సభ్యత్వం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్ పునః సమీక్షించుకోవాలని వెంకటరావు విజ్ఞప్తి చేశారు.

తూర్పు గోదావరి జిల్లా వెంకటాయపాలెం దళితులు తనకు ఓటు వేయలేదని తోట త్రిమూర్తులు 1996లో ఆరుగురు యువకులను పశువుల పాకలో బంధించి శిరోముండనం చేసి చిత్రహింసలకు గురి చేశారని వెంకటరావు వివరించారు. నిరసన కార్యక్రమంలో ఐక్యవేదిక సహ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ, తలపాక సుజాత, బంటు కృష్ణారావు, ఫ్రాన్సిస్ డేవిడ్,పి. రాజేశ్వరరావు, జీ.రాంబాబు, ఎస్.సుధాకర్, మాటూరి చిన్నారావు, ఎం.కోటేశ్వరరావు, జీ.అప్పారావు, ఎం.సత్యనారాయణ, ఆర్​పీ రాజు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: maoist letter: ప్రభుత్వ విధానాలపై.. మావోయిస్టుల నిరసన లేఖ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.