విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి-పినకోట మార్గంలో శారదా నదిపై ఉన్న కాలిబాట వంతెన కోతకు గురైంది. దీంతో దాదాపు వంద గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రైవాడ జలాశయం నుంచి వరద నీరు విడుదల చేయడంతో వంతెన కోతకు గురైంది. నీరు వదిలిన ప్రతిసారి వంతెన కోతకు గురికావడం, తరువాత తాత్కాలిక ఏర్పాట్లు చేయడం రివాజుగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో ఉరుములతో కూడిన జల్లులకు అవకాశం!