ETV Bharat / state

ఆంధ్రా వర్సిటీ వెనుక హత్య కేసు.. నిందితుల అరెస్టు

Murder case: విశాఖ ఏయూ సమత వసతి గృహం వెనుక జరిగిన హత్య కేసును.. పోలీసులు ఛేదించారు. మృతుడి భార్య సందేహాన్ని సీరియస్​గా తీసుకున్న పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు.

culprits arrested in vishakapatnam Murder case
ఏయూ సమత వసతి గృహం వెనుక వ్యక్తి హత్య కేసులో నిందితుల అరెస్టు
author img

By

Published : May 19, 2022, 10:09 AM IST

Murder case: విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ సమత వసతి గృహం వెనుక ఈ నెల 16న జరిగిన హత్య కేసును.. పోలీసులు ఛేదించారు. విశాఖలోని రెవెన్యూ కాలనీకి చెందిన రాజశేఖర్‌.. ఈ నెల 16న ఏయూ సమత వసతి గృహం వెనుక హత్యకు గురయ్యారు. ఇషాక్‌ అనే వ్యక్తిపై మృతుడి భార్య అనుమానం వ్యక్తం చేయగా.. పోలీసులు ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టి, కీలక వివరాలు సేకరించి నిందితులను అరెస్ట్ చేశారు.

రాజశేఖర్‌ ఓ ఫైనాన్స్‌ సంస్థలో రికవరీ ఏజెంట్‌గా పనిచేసేవారు. ఆయనకు.. పొరుగున ఉండే షేక్‌ ఇషాక్‌కు మధ్య ఆర్థికపరమైన లావాదేవీలున్నాయి. వీరిద్దరి మధ్య బ్లాక్ కరెన్సీ వ్యవహారానికి సంబంధించిన లావాదేవీలున్నట్లు పోలీసులు వెల్లడించారు. బ్లాక్‌ కరెన్సీని ప్రత్యేక ద్రావణాల్లో ముంచితే దాదాపు ఒక రోజు పాటు.. నిజమైన నోట్లలా కన్పిస్తాయని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో రాజశేఖర్‌, ఇషాక్​కు మధ్య విభేదాలు తలెత్తాయని తెలిపారు.

రాజశేఖర్‌ తనను మోసం చేశాడని భావించిన ఇషాక్‌.. ఉమామహేశ్వరరావు, సురేష్‌ అనే వ్యక్తులతో కలిసి హత్య చేయాలని కుట్ర పన్నాడు. ఈ నెల 16వ తేదీ రాత్రి రాజశేఖర్‌కు ఫోన్‌ చేసి.. సమత వసతి గృహం వెనక్కి రమ్మన్నాడు. రాజశేఖర్‌ రాగానే కళ్లలో కారం కొట్టి.. రాడ్డుతో గట్టిగా కొట్టారు. తర్వాత కత్తితో పొడిచి హత్య చేసి పారిపోయారు. ఇషాక్‌తో తన భర్తకు వివాదం ఉందని మృతుడి భార్య ఫిర్యాదు చేయడంతో.. అతన్ని పోలీసులు విచారించారు. నిందితులు నేరం అంగీకరించడంతో.. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత కథనం: MURDER: ఫైనాన్స్​ రికవరీ ఏజెంట్​ దారుణ హత్య

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.