విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కాకులు మృతి కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రచారం జరుగుతున్న క్రమంలో పక్షులు చనిపోవడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. రెండు రోజుల క్రితమే అచ్యుతాపురం మండలంలో కొన్ని కాకులు చనిపోయాయి. వాటి మృతికి బర్డ్ ఫ్లూ వైరస్‌కు సంబంధం లేదని అధికారులు తేల్చి చెప్పారు.
అయితే సరిగ్గా ఒకరోజు తేడాతోనే జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణంలోని పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఆరు కాకులు నిమిషాల వ్యవధిలోనే గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాయి. వీటి మృతిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం ఆవరణలోనే పక్షులు మృతిచెందడంతో.. వాటి మృతికి కారణాలు తెలుసుకోవాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
ఇదీ చదవండి: కలకలం రేపుతోన్న కాకుల మృతి..కారణాలను అన్వేషిస్తున్న అధికారులు