ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తమ ఆధార్‌ను ఫోన్ నంబర్‌తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిబంధన తీసుకురావడంతో ఆధార్ కేంద్రాల వద్ద జనం బారులు తీరుతున్నారు. విశాఖ జిల్లా చోడవరం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావటంతో రద్దీ వాతావరణం ఏర్పడింది.
ఉదయం కార్యాలయం గేటు తెరవక ముందే వచ్చి రోడ్లపై గుంపులుగా చేరారు. కరోనా వ్యాప్తి వేళ నిబంధనలు మరచి... పని జరిగితే చాలన్నట్లు జనం వ్యవహరిస్తున్నారు. ఆధార్ లింక్ జరగకపోతే తాము పథకాల ద్వారా లబ్ధిపొందలేమని చెబుతున్నారు.
ఇదీ చదవండి: