నివర్ తుపాను, భారీ వర్షాలు, వరదల కారణంగా విశాఖపట్నం జిల్లాలో 75,67,993 హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నట్టు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధరించారు. దీనిలో 75,27,993 హెక్టార్లలో వరి, 40 హెక్టార్లలో చెరుకు పంటలు ఉందన్నారు. మొత్తం 31 మండలాల్లో 37,494 మంది రైతులు నష్టపోయారని ప్రభుత్వానికి నివేదించారు.
అత్యధికంగా ఎస్ రాయవరం మండలంలో 5,683 మంది రైతులకు చెందిన 1406 హెక్టార్ల వరి పంట పాడైపోయిన నివేదికలో పేర్కొన్నారు. అతి తక్కువగా చింతపల్లి మండలంలో ఆరుగురు రైతులకు చెందిన 192 హెక్టార్ల పంట నష్టం వాటిల్లిందని నివేదించారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ కింద హెక్టారుకు రూ. 15 వేల చొప్పున 7567.993 హెక్టార్లకు సంబంధించి రైతులకు పరిహారం అందునుంది. పంట నష్టంపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపామని ఆయా రైతుల బ్యాంకు ఖాతాలకు త్వరలో పరిహారం సొమ్ము జమ అవుతుందని వ్యవసాయ శాఖ జిల్లా అధికారులు
ప్రకటించారు.
ఇదీ చూడండి: 'చిన్న బాధ ఉంది'... సీఎం జగన్ భావోద్వేగం