విశాఖపట్నం హుకుంపేటలో గుర్తుతెలియని వ్యక్తులు సిగరెట్ తాగి... వరికుప్పల సమీపంలో వేశారు. అక్కడ అంటుకున్న మంటలు వ్యాపించి.. పక్కనే ఉన్న గడ్డి కుప్పలకు అంటుకున్నాయి. ఈ ఘటనలో కుప్పలు పూర్తిగా దగ్దమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే నష్టం జరిగిపోయింది. కాలుతున్న గడ్డివాములను చూసి... రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడింది ఆకతాయిలేనని అన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఇవీ చదవండి