ETV Bharat / state

'పరామర్శించడానికి వెళ్తే అరెస్ట్​ చేస్తారా?' - కేజీహెచ్​ తాజా వార్తలు

ఎల్​జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితి తెలుసుకునేందుకు వెళ్లిన సీపీఎం నాయుకులను పోలీసులు అరెస్టు చేశారు. కంపెనీ యాజమాన్యాన్ని అరెస్ట్​ చేయకుండా బాధితులను పరామర్శించాడానికి వచ్చిన వారిని అరెస్టు చేయడం అన్యాయమని నేతలు ఆగ్రహించారు.

cpm leaders arrested at kgh hospital
సీపీఎం నాయకులను అరెస్ట్​ చేస్తున్న పోలీసులు
author img

By

Published : May 13, 2020, 6:57 PM IST

విశాఖ కేజీహెచ్ వద్ద సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఎల్​జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితి తెలుసుకునేందుకు వెళ్లిన సీపీఎం నగర కార్యదర్శి గంగారావు, సుబ్బారావు, చంద్రశేఖర్ లను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.

ప్రభుత్వం బాధితులకు న్యాయం చెయ్యకుండా, ప్రమాదానికి కారణమైన కంపెనీ యాజమాన్యాన్ని అరెస్టు చేయకుండా.. బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్లిన వారిని అరెస్టు చేయడం దుర్మార్గమని సీపీఎం నాయకులు ఆగ్రహించారు.

ఇవీ చూడండి:

సరదా విహారం.. మిగిల్చింది విషాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.