విద్యుత్ చార్జీల పెంపు, గ్రామీణ విద్యుత్ సహకార సొసైటీలను డిస్కంలలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖపట్నంలో సీపీఎం కార్యకర్తలు నిరసన చేపట్టారు. విద్యుత్ చార్జీలు పెంచి... రైతులు, ప్రజలపై భారాన్ని మోపేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
గ్రామీణ సహకార సోసైటీలను డిస్కంలకు అప్పగిస్తే... ఆ వ్యవస్థ పూర్తిగా నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని విలీనం చేసే అంశంపై ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) కార్యాలయంలో 3 రోజుల పాటు నిర్వహించబోయే... ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇలాంటి ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: తిరుపతిలో రెండు చోట్ల కదిలే విద్యుత్ ఉపకేంద్రాలు ఏర్పాటు