jagananna colany: విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాకలో జగనన్న కాలనీలల్లో ఖాళీ స్థలాలు తప్ప ఎలాంటి నిర్మాణాలు లేవని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు ఆరోపించారు. పెందుర్తి మండలం ముదపాకలోని జగనన్న కాలనీని సీపీఐ ప్రతినిధి బృందం గురువారం పర్యటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి నేటికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ఇక్కడి పరిస్థితులను చూస్తే ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావన్న అనుమానం కలుగుతోందని, ఇప్పటికే కొంతమంది వైకాపా పెద్దల కన్ను ఈ స్థలాలపై పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు నివాసయోగమైన పరిసర ప్రాంతాల్లో ఇళ్లను మంజూరు చేయాలి గాని నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో స్థలాలు కేటాయిస్తే సామాన్య మధ్యతరగతి వర్గం ఎలా జీవిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి మొత్తం నిర్మాణాలను పూర్తి చేసి పేదలకు అందజేయాలని తద్వారా ప్రభుత్వం నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో డిసెంబర్ 5 న జిల్లా మండల రెవిన్యూ, మున్సిపల్ కార్యాలయాల ముందు అర్హులైన లబ్ధిదారులతో సీపీఐ ఆందోళన చేపడుతుందని అన్నారు.
ఇవీ చదవండి