ETV Bharat / state

'ఉత్తరాంధ్రలో భూములు అమ్మి కోస్తాంధ్రాలో పెడతారా..?'

వైకాపా ప్రభుత్వం ప్రాంతీయ అసమానతలకు తెరతీసే ప్రయత్నాలు చేస్తోందని... భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత జె.వి సత్యనారాయణమూర్తి ఆరోపించారు. బిల్డ్ ఏపీ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విలువైన ప్రభుత్వ భూములను అమ్మి... వచ్చిన డబ్బుతో రాయలసీమ, కోస్తా ప్రాంతాలు అభివృద్ధి చేయాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు.

వైసీపీ మండిపడుతున్న సత్యనారయణమూర్తి
author img

By

Published : Nov 22, 2019, 8:33 PM IST

'ఉత్తరాంధ్రలో భూములు అమ్మి కోస్తాంధ్రాలో పెడితో ఊరుకోం'
రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై సీపీఐ సీనియర్ నేత జేవీ సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. ఉత్తరాంధ్రలోని విలువైన భూమూలను అమ్మి... కోస్తా, రాయలసీమను అభివృద్ధి చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన... ఎస్​ఈ జెడ్​ల పేరుతో వేల ఎకరాల ప్రభుత్వ భూములను పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేసిందన్నారు. పరిశ్రమల పేరుతో భూములు తీసుకొని... ఎలాంటి పరిశ్రమలు స్థాపించని వారినుంచి భూములు స్వాధీనం చేసుకోవాలని కోరారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ భూములు అమ్మే కార్యక్రమాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని... లేని పక్షంలో అన్ని పార్టీలను కలుపుకుని ప్రజాఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి

పరిహారం కోసం 'సజీవ సమాధి'తో రైతుల నిరసన

Intro:Ap_Vsp_62_22_CPI_On_Govt_Land_Policy_Ab_AP10150

Body:వైకాపా ప్రభుత్వం ప్రాంతీయ అసమానతలకు తెర తీసే ప్రయత్నాలు చేస్తోందని భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు జె.వి సత్యనారాయణమూర్తి ఇవాళ విశాఖలో ఆరోపించారు బిల్డ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతం లోని విలువైన ప్రభుత్వ భూములను అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో రాయలసీమ కోస్తా ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు ఎస్ ఈ జెడ్ ల పేరుతో వేల ఎకరాల ప్రభుత్వ భూములను పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేసింది అయితే అందులో అనేక మంది పారిశ్రామిక వేత్తలు ఆ భూములను వినియోగించకపోయినా ప్రభుత్వం వారు నుంచి భూములను ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు పరిశ్రమల పేరుతో భూములు తీసుకొని ఎలాంటి పరిశ్రమలు స్థాపించనీ వారినుంచి వెంటనే భూములు స్వాధీనం చేసుకోవాలని కోరారు అంతేకాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భూములు అమ్మి ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు అభివృద్ధి పేరుతో ప్రభుత్వ భూములు అమ్మే కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని లేని పక్షంలో అన్ని పార్టీలను కలుపుకుని ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు
---------
బైట్ జె వి ఎస్ మూర్తి సిపిఐ సీనియర్ నాయకుడు విశాఖ
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.