విశాఖపట్నంలోని సీపీఈ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. బీచ్ రోడ్ కాళీమాత ఆలయం వద్ద ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వాడాల్సిన బ్యాగులు, వస్తువుల వివరాలను తెలియజేస్తూ... విద్యార్థులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నడకకు వచ్చే వారికి అవగాహన కల్పిస్తూ... వారికి ప్లాస్టిక్ వాడొద్దని చెబుతూ... సంతకాలు చేయించారు. ఈ సంతకాల సేకరించిన బ్యానర్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీకి పంపనున్నట్లు కళాశాల ప్రధానోపాధ్యాయులు ఆదినారాయణ వివరించారు.
ఇదీ చదవండి: విశాఖలో 'పట్టణ పేదల ఎన్నికల మేనిఫెస్టో' కార్యక్రమం