కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా హెచ్చరించారు. నగరంలో కర్ఫ్యూ అమలు తీరును ఆయన పర్యవేక్షించారు. సాయంత్రం వేళల్లో చిన్నచిన్న కారణాలు చెప్పి బయటకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో బీచ్ రోడ్, తెన్నేటి పార్కు పరిసరాల్లో పోలీసుల పనితీరును సీపీ నేరుగా పరిశీలించారు. అటువైపుగా వస్తున్న వాహనదారులను ఆపి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అకారణంగా ఎవరూ బయటకు రావొద్దని.. ప్రభుత్వ ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
ఇదీ చదవండి.. నా భర్తకు ప్రాణహాని ఉంది: ఎంపీ రఘురామ భార్య రమ