ETV Bharat / state

పాజిటివ్‌ రోగుల తరలింపు బస్సుల్లోనా...? - విశాఖ కరోనా వార్తలు

కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయిన వారి తరలింపు వ్యవహారం విమర్శలకు దారితీస్తోంది. విశాఖ ఎంవీపీకాలనీ పరిసర ప్రాంతాల్లో పాజిటివ్‌ వచ్చిన 24 మందిని తితిదే కల్యాణ మండపం కూడలికి తీసుకొచ్చారు.

covid patients are carried in bus at vishakapatnam
పాజిటివ్‌ రోగులను బస్సుల్లో తరలింపు
author img

By

Published : Jul 23, 2020, 9:04 AM IST

కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి తరలింపు వ్యవహారం విమర్శలకు దారితీస్తోంది. ఎంవీపీకాలనీ పరిసర ప్రాంతాల్లో పాజిటివ్‌ వచ్చిన 24 మందిని తితిదే కల్యాణ మండపం కూడలికి తీసుకొచ్చారు. వైద్య సిబ్బందిగానీ, రోగులుగానీ కనీస రక్షణ దుస్తులు ధరించలేదు. రోగులను పెద్ద సంఖ్యలో జనసంచారం ఉన్న ప్రాంతాలకు తీసుకొచ్చి కొంతసేపు ఉంచారు. తర్వాత అక్కడకు బస్సులు చేరుకోవటంతో వాటిలో మారికవలసకు తరలించారు. పాజిటివ్‌ రోగులను తరలింపులో కనీస జాగ్రత్తలు పాటించకపోవటంతో కాలనీవాసులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సత్యం కూడలిలో కూడా బస్సుల్లోనే పాజిటివ్‌ రోగులను తరలించారు. ఇలా చేయటం వల్ల ప్రజల్లో ఆందోళన కలుగుతోందని.. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 65 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.