రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కోనసాగుతోంది. విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో కొవిడ్ వైరస్ వ్యాపిస్తోంది. గ్రామీణ మండలాల్లో కరోనా విస్తరిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
తాజాగా కె.కోటపాడు మండలం సూదువలస గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ నిర్థరణ అయ్యింది. ఆమె అనకాపల్లిలోని మహిళా పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. సూదివలస నుంచి అనకాపల్లికి రోజూ రాకపోకలు సాగిస్తుండగా వైరస్ బారినపడ్డారు. ఆమె కుటుంబసభ్యుల్లో ఏడుగురికి పరీక్షలు నిర్వహించగా... ఫలితాలు రావాల్సి ఉంది. దీంతో గ్రామంలో వైద్య, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది సర్వే చేశారు.
దేవరాపల్లిమండలం వేచలం, బోయకింతాడ గ్రామాల్లో ఇద్దరికి పాజిటివ్‌గా తేలిందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రెండు గ్రామాల్లో బ్లీచింగ్, హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో రెడ్జోన్లను ఏర్పాటు చేశారు. సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ప్రజలకు కొవిడ్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.
ఇవీ చదవండి:కరోనా కట్టడికి పురపాలకశాఖ కార్యాచరణ