ETV Bharat / state

మైనర్​ బాలిక రేప్​ కేసు.. ముగ్గురికి 20 ఏళ్ల జైలుశిక్ష - బాలికపై అత్యాచారం కేసులో నిందితులకు జైలు శిక్ష

Court Verdict On Minor Rape Case: విశాఖ జిల్లా పెద్ద గంట్యాడ ప్రాంతానికి చెందిన 11 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులకు మహిళా న్యాయస్థానం ఒక్కొక్కరికి జైలు శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధించింది.

jail
జైలు
author img

By

Published : Dec 29, 2022, 8:24 PM IST

Court Verdict On Minor Rape Case: విశాఖ జిల్లా పెద్ద గంట్యాడ ప్రాంతానికి చెందిన 11 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ముగ్గురు ముద్దాయిలకు ఒక్కొక్కరికి 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్షను మహిళా న్యాయస్థానం విధించింది. దీంతోపాటు ఒక్కొక్కరూ పదివేల రూపాయల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది.

ఇదేకాకుండా 2011లో జరిగిన ఈ ఘటనపై ఇండియన్ పీనల్ కోడ్ ద్వారా నమోదైన కేసును డిప్యూటీ డైరక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎం. శైలజ న్యాయస్ధానంలో ముద్దాయిలకు శిక్షపడే వరకు శ్రమించారు. ముద్దాయిలు పెద్ద గంట్యాడకు చెందిన మహమ్మద్ అమీర్, పుట్లూరు రాంజీ, మహమ్మద్ అష్రఫ్​లు నేరాన్ని అంగీకరించడంతో వాదనలను పరిశీలించిన మహిళా న్యాయస్దానం సెషన్స్ జడ్జ్ మోకా సువర్ణ రాజు ఇవాళ తీర్పు వెలువరించారు. తీర్పు అనంతరం ముగ్గురు ముద్దాయిలను కేంద్ర కారాగారానికి తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.