విశాఖ ఏజెన్సీలో పనిచేస్తున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ కు కరోనా నిర్ధరణ అయ్యింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖ మన్యం కొయ్యూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఈ మధ్య గుంటూరు నుంచి కొయ్యూరు వచ్చారు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది.
స్టేషన్ పరిసరాల శానిటైజ్ చేయించారు. పోలీసులతో పాటు మండల స్థాయి అధికారులు, పంచాయితీ సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు: సీఎం జగన్