విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని క్రైమ్ విభాగంలో పని చేస్తున్న ఓ సీఐకి కరోనా వచ్చింది. అతనికి పాజిటివ్ అని తేలడంతో అతనితో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఆయనతో సన్నిహితంగా ఉన్న పోలీసులు ..ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. రెండు స్టేషన్ల పరిధిలో 30 మంది సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వీరి ఫలితాలు రావాల్సి ఉంది. అలాగే కమిషనరేట్ పరిధిలోని పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు.
ఇదీ చూడండి. సరిహద్దులో అమరులైన వీర జవాన్లకు ఆంధ్రుల అశ్రు నివాళి