గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు విడుదల చేసిన నివేదికలో 141 కేసులు నరసరావుపేట పట్టణంలో నమోదైనట్లుగా తెలిపారు. దీంతో పట్టణంలో ఇప్పటివరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 1292కు చేరుకోగా మండలంలో 326కు చేరుకున్నాయి. అలాగే రొంపిచర్ల మండలంలో 391 కేసులు నమోదయ్యాయి. నరసరావుపేట నియోజకవర్గంలోని నరసరావుపేట, రొంపిచర్ల రెండు మండలాలు కలిపి మొత్తం కరోనా కేసులు 2009 కి చేరాయని అధికారులు తెలిపారు. నియోజకవర్గంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనాకేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చూడండి.
'ప్రభుత్వం ఇచ్చే డబ్బు.. మహిళల జీవితాన్ని మార్చేందుకే'