ETV Bharat / state

సరిహద్దు గ్రామాల్లో కరోనా వ్యాప్తి కలకలం.. గిరిజనుల్లో భయం - విశాఖపట్నం తాజా వార్తలు

కరోనా మహమ్మారి.. చాపకింద నీరులా గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకుపోతోంది. ఆంధ్రా - ఒడిశా సరిహద్దులోని బోండా గ్రామాల్లో గిరిజనులకు ఈ వైరస్ వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది.

గిరిజనులకు మాస్కులు పంపిణీ చేస్తున్న అధికారులు

author img

By

Published : May 18, 2021, 6:50 AM IST

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులోని బోండా గ్రామాల గిరిజనులు కరోనా భయంతో వణికిపోతున్నారు. వైరస్ వ్యాప్తి.. అక్కడి ప్రజల్లో ఆందోళన పెంచుతోంది. ఒడిశాలోని మల్కన్​గిరి జిల్లా కోయిర్ ఫుట్ సమితి పరిధిలో ఉన్న ముదులిపడ, ఆంధ్రాహల్ పంచాయతీలో... మొత్తం 20 పాజిటివ్​ కేసులు వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

ఈ రెండు పంచాయతీల్లో ఆదిమ జాతికి చెందిన గిరిజనులకు కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న బోండా తెగకు... కరోనా సోకిన విషయం తెలిసి మల్కన్​గిరి ఐసీఐసీఐ బ్యాంక్ వారు స్పందించారు. స్థానిక అధికారుల తో కలసి కొన్ని గ్రామాలు సందర్శించి వారికి ఉచిత మాస్క్​లు, శానిటైజర్లు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:

దారుణం : ఇద్దరు పిల్లలను గొంతుకోసి చంపిన తల్లి

అతితీవ్ర తుపానుగా తౌక్టే- 'మహా'లో విధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.