తమను విధుల్లోకి తీసుకోవాలని ఒప్పంద కార్మికుల ఆందోళన విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారంలో ఒప్పంద కార్మికులు ఆందోళనకు దిగారు. కర్మాగారంలో గానుగాట ప్రారంభమైనా..ఇప్పటికీ తమను విధుల్లోకి తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్మాగారంలో చెరకు తూనిక కేంద్రాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని వారు తప్పుబట్టారు. ప్రైవేటు వ్యక్తుల స్థానంలో ఒప్పంద కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
ఇసుక తిన్నెలపై... మెగా పోరు..