విశాఖ జిల్లా అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద నిర్మాణ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. లాక్డౌన్ కారణంగా నష్టపోయిన కార్మికులకు సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సాయం రూ.10,000 అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దారి మళ్లించిన నిధులను సంక్షేమ బోర్డు ఖాతాలో జమ చేయాలని, ఇసుక సరఫరా సులభతరం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు భద్రం, లక్ష్మణ్ తో పాటు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి