ఉత్తర్ప్రదేశ్లో దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరితీయాలని... విశాఖ జిల్లా అనకాపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. యూపీలో మైనారిటీలు, దళితులపై దాడులు పెరిగి పోతున్నాయని, దళిత యువతి అత్యాచార ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు గంగాధర్ తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు పరామర్శించడానికి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీలను పోలీసులు అడ్డుకొని దురుసుగా ప్రవర్తించడం దారుణమన్నారు.
ఇదీ చదవండి: