ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా అబ్దుల్ సలాం కుటుంబానికి సంతాపం

author img

By

Published : Nov 12, 2020, 11:20 PM IST

అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ముస్లిం, మైనారిటీ నేతలు, తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. వారి కుటుంబానికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

Candlelight rally in Nandyal
నంద్యాలలో కొవ్వొత్తుల ర్యాలీ

కర్నూలు జిల్లా

నంద్యాల

Candlelight rally in Nandyal
నంద్యాలలో కొవ్వొత్తుల ర్యాలీ

కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో శ్రీనివాసనగర్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ సాగింది. మాజీమంత్రి భూమా అఖిల ప్రియ, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, తెదేపా నాయకుడు ఫిరోజ్, దళిత, ముస్లిం ఐకాస నాయకులు శ్రావణ్ కుమార్ బషీర్ అహ్మద్, ముస్లిం ప్రజా సంఘాల నాయకులు, తెదేపా కార్యకర్తలు పాల్గొన్నారు. నలుగురు మరణిస్తే రూ.25 లక్షలు ఇచ్చి ...వారి ప్రాణాలకు డబ్బుతో వెలకట్టారని ప్రభుత్వ తీరుపై అఖిల ప్రియ మండిపడ్డారు.

ఎమ్మిగనూరు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. పోలీసుల వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబానికి సోమప్ప కూడలిలో సంతాపం ప్రకటించారు. తెదేపా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు.

తూర్పు గోదావరి జిల్లా

రాజోలు

Rally of candles in Rajolu
రాజోలులో కొవ్వొత్తుల ర్యాలీ
వైకాపా ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీ దళితులపై దాడులు పెరిగిపోయాయని తూర్పు గోదావరి జిల్లా రాజోలులో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. వారిపై దాడులను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. వారి కుటుంబానికి శాంతి కలగాలని ర్యాలీ నిర్వహించారు.

సామర్లకోట

సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో తెదేపా నాయకులు డిమాండ్‌ చేశారు. పెద్దాపురం నియోజకవర్గంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. సామర్లకోట పట్టణ బ్రౌన్​పేట జంక్షన్ నుంచి సామర్లకోట పట్టణ పాత తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించారు. "కొన్ని మతాల వారిని పనిగట్టుకొని వేధించడమే జగన్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని నాయకులు విమర్శించారు. నంద్యాల‌లో అబ్దుల్ స‌లాం కుటుంబాన్ని వెంటాడి హింసించి.. సామూహిక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డేలా చేసి.. ఇప్పుడు ప‌రిహారం ప్ర‌క‌టించారన్నారు. ‘‘బంగారు భ‌విష్య‌త్తు గ‌ల 14 ఏళ్ల కూతురు సల్మా, 12 ఏళ్ల కుమారుడు కలందర్‌ని .. 25 లక్షలు వెనక్కి తీసుకొస్తాయా అని ప్రశ్నించారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో త‌న కూతురిని వేధించిన వారిపై ఫిర్యాదు చేసిన తండ్రి సత్తార్... ఎస్పీ కార్యాల‌యం ఎదుటే ఆత్మ‌హ‌త్యాయత్నానికి పాల్ప‌డితే స్పందించలేదన్నారు.

విశాఖ జిల్లా

అబ్దుల్ కలాం కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి కలగాలని విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. వారి ఆత్మహత్యలకు దారితీసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే అన్నారు.వారు ఆత్మహత్య చేసుకోవడం చాలా ఘోరమైన ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు.

కృష్ణా జిల్లా

జగ్గయ్యపేట
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో అబ్దుల్ సలాం కుటుంబానికి ముస్లిం, మైనారిటీ నేతలు సంతాపం ప్రకటించారు. ఆత్మహత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య శాంతి ర్యాలీ నిర్వహించారు. నలుగురు కుటుంబ సభ్యులు సామూహిక ఆత్మహత్య చేసుకున్నారంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ప్రభుత్వ, పోలీసుల పనితీరు ఎలా ఉందో కనపడతుందని వ్యాఖ్యానించారు . గూడ్స్ రైలు కింద ప్రాణాలు తీసుకున్నారంటే ...పోలీసులు ఏవిధంగా చిత్రహింసలకు గురిచేశారో, భయపెట్టారో ప్రజలందరూ గుర్తించాలన్నారు.

జుజ్జూరు

నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులో ముస్లిం నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. మైనార్టీల‌పై దాడులు పెరుగుతున్నాయని వారు విమర్శించారు. చేయ‌ని నేరానికి స‌లాం కుటుంబాన్ని బ‌లిచేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాల‌న సాగుతోంద‌ని, నేరం చేయ‌క‌పోయినా త‌ప్పుడు కేసులు బ‌నాయిస్తున్నార‌ని మండిప‌డ్డారు. పోలీసుల చిత్రహింస‌లు, వైకాపా నాయ‌కుల దౌర్జన్యాల‌కు తాళ‌లేకే సలాం కుటుంబం సామూహికంగా ఆత్మహ‌త్య చేసుకుంద‌ని విమ‌ర్శించారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకొని ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.

నెల్లూరు జిల్లా

రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన చేస్తోందని నెల్లూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు మండిపడ్డారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబానికి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ చెంచల బాబు యాదవ్, రవికుమార్ చౌదరి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. బస్టాండ్ కూడలిలో కొవ్వొత్తులను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి, డీజిపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అక్రమ కేసులు బనాయించి వేధించటం వల్ల అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అన్నారు. దేశంలో ఇలాంటి ఘోరమైన ఘటన ఎక్కడా జరగలేదన్నారు.

అనంతపురం జిల్లా

Candlelight rally at Kalyanadurgam
కల్యాణదుర్గంలో కొవ్వొత్తుల ర్యాలీ
సలాం కుటుంబ మృతికి కారణమైన అధికారులను వెంటనే శిక్షించాలని తెదేపా నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ నుంచి మసీద్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సలాం కుటుంబం మృతికి కారకులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారకులైన అధికారులతోపాటు నాయకులను కూడా గుర్తించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మసీద్ సర్కిల్లో చేసిన ఈ నిరసన కార్యక్రమంతో రవాణాకు కొంతసేపు అంతరాయం వాటిల్లింది.

చిత్తూరు జిల్లా

Candlelight rally in Puttur
పుత్తూరులో కొవ్వొత్తుల ర్యాలీ
నంద్యాలలో పోలీసుల వేధింపులకు బలైన అబ్దుల్ సలాం కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ చిత్తూరు జిల్లా పుత్తూరులో ర్యాలీ నిర్వహించారు. తెదేపానేత జీవరత్నం నాయుడు , మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఏ.రఫీ అహమ్మద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. చేయని తప్పును ఒప్పుకోమని బెదిరించడం వల్లనే నంద్యాలకు చెందిన ఆటోడ్రైవర్ అబ్దుల్ సలాం, తన భార్య నూర్జహాన్ , ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం ముస్లిం మైనారిటీలను, బడుగు బలహీనవర్గాలను వాడుకున్న సీఎం ప్రభుత్వంలో మైనారిటీల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు.

గుంటూరు జిల్లా

Candlelight rally at Tadikonda
తాడికొండలో కొవ్వొత్తుల ర్యాలీ

గుంటూరు జిల్లా తాడికొండలో అబ్దుల్ సలాం కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. పెద్ద మసీదు నుంచి ఈ నిరసన ర్యాలీ చేపట్టారు. సీఐ సోమశేఖర్ రెడ్డిపై 174 సీఆర్​పీసీ, 323 & 324 ఐపీసీ క్రింద కేసు నమోదు అయిందని పార్లమెంట్ మహిళ ప్రధాన కార్యదర్శి రిజ్వాన అన్నారు. నవంబర్ 8వ తేదీ ఎఫ్​ఐఆర్​లో 174 సీఆర్​పీసీ తీసేసారన్నారు. సుసైడ్ వీడియో బయటికి వచ్చినా... సెక్షన్ 306 క్రింద కేసు పెట్టలేదని గుర్తుచేశారు. జడ్జి ముందు సరైన ఆధారాలు పెట్టలేదని... ఇది ముమ్మటికీ కుట్ర అని తెలిపారు. ఈ ర్యాలీలో ముస్లిం మత పెద్దలు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి. చెట్టు కింద వైద్యం... అవస్థలు పడుతున్న రోగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.