విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం కోనాం గ్రామ సచివాలయం సిబ్బంది ఎప్పుడొస్తున్నారో...? అసలు రారో తెలియని పరిస్థితి నెలకొందని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరటా నరసింహమూర్తి, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి రొంగలి దేముడునాయుడు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. సిబ్బంది కనీసం సమయపాలన పాటించటంలేదని, ప్రజలు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. ఒకరో ఇద్దరో వస్తున్నారని.., వారు కూడా మధ్యాహ్నం వస్తారని చెప్పారు. కోనాం గిరిజన పంచాయతీ పరిధిలో 14 గ్రామాల ప్రజలు.. ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి సచివాలయంలో ప్రజలకు సేవలు అందేలా చూడాలని కోరారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు.
ఇది చదవండి కరోనా ఎఫెక్ట్: సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ రద్దు