Committee Report is Nominal to Shifting of Administration Activities to Vizag : ముఖ్యమంత్రికి, కీలక అధికారులకు విశాఖలో తాత్కాలిక వసతి కోసం భవనాలు గుర్తించేందుకు ప్రభుత్వం తాజాగా కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నియామకం, నివేదిక సమర్పించడం తూతూ మంత్రమేనన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే గుర్తించిన భవనాలతో కూడిన వివరాలను జిల్లా అధికారులు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందులో VMRDA, GVMC, కలెక్టరు కార్యాలయం, ప్లానింగ్ విభాగాల అధికారులు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
Being Advertised Will CM Camp Office at Rushikonda : ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం రుషికొండ వద్ద ఉంటుందని ప్రచారం. పోర్టు అతిథి గృహం, బేపార్క్లోనూ ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విశాఖ నుంచి పాలన ఉంటుందని సీఎం ప్రకటించక ముందు నుంచే కార్యాలయాలు, వసతులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు. ప్రభుత్వంలో కీలక శాఖల అధికారులు పలుమార్లు ఇక్కడి భవనాలను పరిశీలించారు.
Jagan promises to Vizag: సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మహానగరం.. హామీల అమలులో జగన్ వైఫల్యం
Officials Have Vacated Central Government Institutions : ప్రభుత్వ యంత్రాంగం విశాఖకు రాగానే ఉపయోగించుకునేలా ఇప్పటికే కొన్ని కార్యాలయాలను సిద్ధం చేశారు. సిరిపురం VMRDAఉద్యోగ భవనంలో తొమ్మిది అంతస్తులు ఉండగా 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన రెండు ఫ్లోర్లు అందుబాటులో ఉంచారు. ఇందుకు అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఖాళీ చేయించారు. 'సీ వ్యూ' కలిగిన 3వ అంతస్తులో ఓ కీలక అధికారికి, మరికొందరు అధికారులకు కేటాయించాలని చూస్తున్నారు. పిఠాపురం కాలనీలో నాలుగు అంతస్తుల వాణిజ్య సముదాయం కట్టి ఏళ్లు గడిచినా, రాష్ట్రప్రభుత్వం కోసమే ఖాళీగా ఉంచారు.
కొద్ది రోజుల కిందట ఓ ఐఏఎస్ అధికారి చూసి వెళ్లారు. పోర్టు ఏరియాలో పాత మున్సిపల్ కార్యాలయాన్ని మానవవనరుల శిక్షణ విభాగానికి అప్పగించారు. దీన్ని రెండున్నర కోట్ల రూపాయలతో ఆధునికీకరించారు. GVMC కార్యాలయాన్ని ఖాళీ చేస్తారన్న ప్రచారం ఉంది. ద్వారకా బస్టాండ్లో బహుళ వినియోగ భవనంలోని ఖాళీ ఫ్లోర్లను ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. రుషికొండ, మధురవాడ ప్రాంతాల్లో కొన్ని విశాలమైన భవనాలను అధికారులు పరిశీలించారు. ఐటీ హిల్స్‌లోనూ కొన్ని అందుబాటులో ఉంచారు.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న VMRDA కమిషనర్ బంగ్లాను ఓ కీలక అధికారికి కేటాయిస్తారని సమాచారం. కొందరు ఐఏఎస్ అధికారులు ఇప్పటికే పనోరమ హిల్స్, బీచ్ రోడ్డులోని కొన్ని విల్లాలు, మధురవాడ, రుషికొండలో ఇళ్లు చూసుకున్నారు. మంత్రులు బీచ్ రోడ్డు, లాసన్స్‌బే కాలనీ, విశాలాక్షి నగర్, రుషికొండ, విజయనగర కాలనీ, సాగర్ నగర్‌లో ఇళ్లు కొన్నారు. ఉద్యోగుల కోసం మధురవాడలో ఖాళీగా ఉన్న అపార్టుమెంట్లను చూసినట్లు తెలిసింది.