ETV Bharat / state

కేజీహెచ్​ కొవిడ్​ సెంటర్​లో కలెక్టర్ తనిఖీలు.. ఏర్పాట్లపై​ అంసతృప్తి - collector fire on KGH covid Center news update

కొవిడ్ నియంత్రణకు సంబంధించి ప్రతి నియోజక వర్గ పరిధిలో కొవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాట్లు వేగవంతం చేయాలని ఆంధ్ర వైద్య కళాశాలలో జరిగిన సమీక్షలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. కేజీహెచ్​లో కొవిడ్ కేర్, టెస్టింగ్ ల్యాబ్​లను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Collector checks at KGH Kovid Center
కేజీహెచ్​ కొవిడ్​ సెంటర్​లో కలెక్టర్ తనిఖీలు
author img

By

Published : Jul 20, 2020, 11:31 PM IST

విశాఖలోని కేజీహెచ్​లో కొవిడ్ కేర్, టెస్టింగ్ ల్యాబ్​లను కలెక్టర్ వినయ్ చంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితి పరిశీలించిన ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టెస్టింగ్ శాంపిల్స్ వీఆర్డీఎల్, వీటీఎంఎస్, ఆర్​టీపీసీఆర్ మిషన్ ద్వారా చేసే పరీక్షలకు సంబంధించి నివేదికలు ఆలస్యం అవుతున్న తరుణంలో వైద్యులు, సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహించారు.

పరీక్ష ఫలితాలు 24 గంటల్లోగా పంపించాలని, ఆలస్యమైన పక్షంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వేగంగా వ్యాపిస్తున్న కారణంగా నియోజకవర్గ పరిధిలో కొవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటును త్వరగతిన చేపట్టాలన్నారు. ప్రతి సెంటర్లో 300 పడకలకు తక్కువ కాకుండా సిద్ధంగా ఉంచాలని సూచించారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు ఇంఛార్జ్​లుగా వ్యవహరించాలని, నిత్యం వాటి నిర్వహణ పరిశీలించాలని ఆదేశించారు.

ఇవీ చూడండి:

'అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నారు?'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.