సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణపై విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు, యుపీఎస్సీ తనిఖీ అధికారి పరీక్షలను పర్యవేక్షిస్తారని తెలిపారు. జిల్లాలో 10,796 మంది అభ్యర్దులు 27 కేంద్రాల్లో పరీక్ష రాస్తారన్నారు. పరీక్ష కేంద్రాల సూపర్వైజర్లు, స్థానిక తనిఖీ అధికారులు, ఇన్విజిలేటర్లు, ఎగ్జామ్ మెటీరియల్‌ను తీసుకు వెళ్లడంలోనూ, పరీక్ష అనంతరం తిరిగి పంపించడంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. తాగునీరు సౌకర్యం కల్పించాలని, పరీక్షా కేంద్రాలను శానిటైజ్ చేయాలని జీవీఎంసీ అధికారులను కోరారు. అంతరాయం లేకుండా విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఈపీడీసీఎల్‌ను, ఆర్టీసి సంస్థ అక్టోబరు 3, 4 తేదీల్లో పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులను నడపాలని కోరారు.
కోవిడ్ నిబంధనల ప్రకారం పరీక్షా కేంద్రాల వద్ద మాస్క్ లు, శానిటైజర్లు, థర్మల్ స్క్రీనర్లు, పల్స్ ఆక్సీమీటర్లు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచాలని డీఎం అండ్ హెచ్ఓ ను కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇవీ చూడండి...